![]() |
![]() |

నో రివ్యూస్ ఓన్లీ రికార్డ్స్ అంటూ మహేష్ తన గుంటూరు కారం మూవీతో సరికొత్త రికార్డులు సృషించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ ని సాధించిన మహేష్ గుంటూరు కారంలోని తన క్యారక్టర్ కి సంబంధించిన సీక్రెట్ ఒక దాన్ని చెప్పడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యింది.
గుంటూరు కారంలో మహేష్ బీడీ కాల్చే స్టైల్ అయితే మహేష్ తో పాటు ఆడియెన్స్ ని సూపర్ గా మెస్మరైజ్ చేసింది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మహేష్ కాల్చింది ఒరిజినల్ బీడీ కాదు ఆయుర్వేదంతో తయారు చేసిన ఆయుర్వేద బీడిని. మూవీలోని తన క్యారక్టర్ దృష్ట్యా మహేష్ మొదట ఒరిజినల్ బీడీనే కాల్చేవాడు. దాంతో మహేష్ కి దగ్గు విపరీతంగా వచ్చేది.ఆ తర్వాత చిత్ర యూనిట్ మహేష్ ఆరోగ్యం దృష్ట్యా ఆయుర్వేద బీడీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్నీ మహేష్ బాబే స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.
ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు కూడా బీడీ అలవాటు ఉన్నవాళ్లు మహేష్ ఆయుర్వేద బీడీని తాగితే బీడీని తాగామనే ఫీలింగ్ తో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని అంటున్నారు. ఆల్రెడీ కొంత మంది మహేష్ బీడీల కోసం ఎంక్వయరీ చెయ్యడం కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతానికి అయితే టాక్ తో సంబంధం లేకుండా గుంటూరు కారం రికార్డు కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తుంది
![]() |
![]() |