Home  »  News  »  ఆర్జీవీ బాటలో రాజమౌళి.. అంతకు మించి

Updated : Mar 15, 2022

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకి ఎలాంటి ప్రశ్న ఎదురైనా తనదైన శైలిలో సమాధానం చెప్తుంటాడు. అప్పుడు అలా చెప్పి, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని ఎవరైనా అడిగితే.. 'నా ఇష్టం' అని ఆన్సర్ చెప్తాడు లేదా 'అప్పుడు అబద్ధం చెప్పాను' అని అంటాడు. అందుకే ఆర్జీవీని ప్రశ్నలతో ఇరుకున పెట్టలేమని అంటుంటారు. అయితే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి కూడా ఆర్జీవీ స్టైల్ ఫాలో అవుతున్నాడు. ఆర్జీవీ స్టైల్ ఆన్సర్ అని చెప్పి మరీ ఓ సమాధానంతో తాజాగా షాక్ ఇచ్చాడు.

'ఆర్ఆర్ఆర్' మూవీ మార్చి 25 న ప్రేక్షుకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రాజమౌళికి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. "మగధీర సినిమా తర్వాత ఇక మీదట భారీ సినిమాలు తీయనని, ఈ తలనొప్పులు భరించడం నా వల్ల కాదంటూ 'మర్యాద రామన్న' సినిమా తీశారు. కానీ ఇప్పుడు 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' అంటూ మగధీరకు మించిన భారీ సినిమాలు తీస్తున్నారు. కారణం ఏంటి?" అనే ప్రశ్న ఎదురు కాగా.. మొదట కాసేపు మౌనంగా ఉన్న రాజమౌళి ఆ తర్వాత ఆర్జీవీ గారి ఆన్సర్ అంటూ 'అప్పుడు అబద్ధం చెప్పాను' అని తెలివిగా సమాధానం చెప్పాడు రాజమౌళి.

అలాగే, 'ఆర్ఆర్ఆర్' సినిమా 'బాహుబలి-1', 'బాహుబలి-2' కంటే బిగ్గర్ ఫిల్మ్ అని రాజమౌళి అన్నాడు. తాను ఎప్పుడూ తన సినిమా అంత కలెక్ట్ చేస్తుంది, రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని చెప్పలేదని.. కేవలం ఆడియన్స్ ని మెప్పిస్తుందని మాత్రమే కాన్ఫిడెంట్ గా చెప్తానని తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా కూడా ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని, బాహుబలిని మించి ఆడియెన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని రాజమౌళి చెప్పారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.