![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి, అభిమానులకి మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఆ అనుబంధం హీరో, ఫ్యాన్స్ అనే సంప్రదాయాన్ని దాటి చాలా ఏళ్ళవుతుంది. అభిమానులు చిరంజీవిని తమ కుటుంబ సభ్యుడుగా భావిస్తే, చిరంజీవి కూడా తన అభిమానులని కుటుంబ సభ్యులుగా బావిస్తుంటాడు. చిరంజీవి పిలుపు మేరకు అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంటే, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా అన్ని విషయాల్లోను చిరంజీవి వెన్నుదన్నుగా ఉంటాడు.
.
రీసెంట్ గా 'ఆంధ్రప్రదేశ్'(Andhrapradesh)లోని 'కర్నూల్ జిల్లా 'ఆదోని'(Adoni)పట్ణణానికి చెందిన 'రాజేశ్వరి'(Rajeswari)అనే మహిళా అభిమాని, ఎలాగైనా సరే 'చిరంజీవి'ని చూడాలని అనుకుంది. దీంతో ఆదోని నుంచి 'హైదరాబాద్'(Hyderabad)కి సైకిల్ పై బయలు దేరింది. ఆ ప్రయాణంలో ఆమె ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్నా ,చిరంజీవి పై ఉన్న అభిమానంతో విజయవంతంగా తన లక్ష్యాన్ని చేరుకుంది. చిరంజీవి ఈ విషయం తెలియడంతో తన పట్ల రాజేశ్వరి చూపిన అభిమానానికి చలించిపోయాడు. రాజేశ్వరిని తన ఇంటికి పిలిపించుకొని ఆమె యోగ క్షేమాలు తెలుసుకున్నాడు. అనతంరం చిరంజీవికి రాజేశ్వరి 'రాఖీ' కట్టగా, చిరంజీవి ఆమెకి ఖరీదైన 'చీర'ని బహూకరించాడు.
ఈ సందర్భంగా రాజేశ్వరి, తన ఇద్దరి పిల్లలతో కలిసి చిరంజీవితో దిగిన ఫోటోలు అభిమానులని ఆకర్షిస్తున్నాయి. రాజేశ్వరి పిల్లల చదువు, భవిష్యత్తు కోసం పూర్తి స్థాయిలో ఆర్ధిక సహకారం అందించనున్నట్టుగా చిరంజీవి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
![]() |
![]() |