![]() |
![]() |

నాచురల్ స్టార్ 'నాని'(Nani)నటనలో దాగి ఉన్న కొత్త కోణాన్ని పరిచయం చేసిన చిత్రం 'హిట్ 3 '(Hit 3). ఈ మూవీలో 'ఏఎస్ పి వర్ష' క్యారక్టర్ లో నటించి ప్రేక్షకులని, తన నటనతో మెస్మరైజ్ చేసిన నటి 'కోమలి ప్రసాద్'(Komalee Prasad).ముఖ్యంగా క్లైమాక్స్ కి సంబంధించి యాక్షన్ సన్నివేశాల్లో చాలా అద్భుతంగా చేసింది. హిట్ మొదటి రెండు భాగాల్లో కూడా నటించి తన సత్తా చాటిన 'కోమలి ప్రసాద్' సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటు అభిమానులతో ముచ్చటిస్తుంది.
రీసెంట్ గా ఒక నెటిజన్ కోమలి ప్రసాద్ ని ఉద్దేశించి 'హిట్ 3 లో సహాయ క్యారక్టర్ లో నటించానని బాధపడకండి. పోలీసుగా నటించే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు వర్ష క్యారక్టర్ లో అద్భుతంగా నటించారని పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ కి కోమలి ప్రసాద్ రిప్లై ఇస్తు ఒక స్టార్ హీరోతో పాటు పోలీస్ క్యారక్టర్ లో కనిపించడం చిన్న విషయం కాదు. అలాంటి అవకాశం అరుదుగా వస్తుంది. ఈ విషయం ప్రేక్షకులకి బాగా తెలుసు. హిట్ ఫ్రాంచైజీతో ఎంతో మంది ప్రేక్షకులకి చేరువయ్యాను. పైగా విభిన్న పాత్రలని పోషించగలననే నమ్మకం కూడా కలిగింది. మార్షల్ ఆర్ట్స్ రివెంజ్ డ్రామా చిత్రాలకి ఐకాన్ గా ఉన్న 'కిల్ బిల్' లాంటి పూర్తి స్థాయి యాక్షన్ చిత్రాల్లో నటించాలని ఉందని బదులిచ్చింది.
2016 లో 'నేను సీతాదేవి' అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన 'కోమలి ప్రసాద్ ఆ తర్వాత నెపోలియన్, అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి వంటి చిత్రాల్లో హీరోయిన్ గాను చేస్తు, మరో పక్క విభిన్న పాత్రలు చేస్తు బిజీగా ఉంది. ప్రస్తుతం పలాస ఫేమ్ 'రక్షిత్ అట్లూరి'(Rakshit Atluri)సరసన 'శశివదనే' అనే చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది. కోమలి ప్రసాద్ స్వస్థలం విశాఖపట్నం.

![]() |
![]() |