![]() |
![]() |

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న '18 పేజెస్' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. నేడు(జూన్ 1) నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ తరఫున నిఖిల్ కు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సినిమాలో సిద్ధు పాత్రలో నిఖిల్.. నందిని పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతున్నారు. మొబైలే ప్రపంచంగా బ్రతికే అబ్బాయికి, కాగితాలు మీద అక్షరాలు రాయడం ఇష్టపడే అమ్మాయికి మధ్య జరిగే క్యూట్ లవ్ స్టోరీ ఈ మూవీ అని తెలుస్తోంది. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ తో సినిమా మీద అంచనాలు పెరిగాయి. నిఖిల్ కళ్ళకు కాగితపు గంతలు కట్టి దానిపై అనుపమ పెన్నుతో రాస్తున్నట్లు చాలా డిఫరెంట్ గా ఉంది పోస్టర్.

ఇక ఈ సినిమాకు 'కుమారి 21F'ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
![]() |
![]() |