![]() |
![]() |

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న 'ఖుషి' సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మిస్తున్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
గత నెల 23 తేదీ నుంచి కశ్మీర్ లో 'ఖుషి' రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. అక్కడి అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం గ్రూప్ ఫొటో దిగారు. "కశ్మీర్ షెడ్యూల్ అమేజింగ్ ఫీల్ ఇచ్చింది. విజయ్, సమంతతో పాటు యూనిట్ అందరికీ థాంక్స్" అంటూ దర్శకుడు శివ నిర్వాణ ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.

నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్ మొదలవుతుంది. ఆ తర్వాత వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
![]() |
![]() |