Home

»

Latest News

ఏప్రిల్ - జూలైః న‌దియా హ‌వా!

May 23, 2022 2:56PM

టాలీవుడ్ బిజీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్స్ లో న‌దియా ఒక‌రు. ఒక‌ప్ప‌టి ఈ అందాల తార‌.. గ‌త కొంత‌కాలంగా ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపిస్తూ తెలుగువారిని ఎంట‌ర్టైన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, 2013 నుంచి తెలుగు తెర‌పై న‌దియా రెగ్యుల‌ర్ గా ద‌ర్శ‌న‌మిస్తూనే ఉన్నా.. 2022 క్యాలెండ‌ర్ ఇయ‌ర్ త‌న‌కు ఎంతో ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఏప్రిల్, మే, జూన్, జూలై ఇలా నాలుగు వ‌రుస నెల‌ల్లో న‌దియా న‌టించిన సినిమాలు వెండితెర వినోదాల‌కు చిరునామా అయ్యాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే.. ఏప్రిల్ లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ `గ‌ని`లో క‌నిపించిన న‌దియా.. మే నెల‌లో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు `స‌ర్కారు వారి పాట‌`లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇక జూన్ నెల‌లో నేచుర‌ల్ స్టార్ నాని కొత్త చిత్రం `అంటే.. సుంద‌రానికీ`లో సంద‌డి చేయ‌నున్న న‌దియా.. జూలైలో ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని `ద వారియ‌ర్`లో ఎంట‌ర్టైన్ చేయ‌నున్నారు. మొత్త‌మ్మీద‌.. ఏప్రిల్ నుంచి జూలై వ‌ర‌కు వ‌రుస‌గా నాలుగు నెల‌ల పాటు న‌దియా తెలుగు తెర‌పై కనిపించ‌నుండ‌డం విశేష‌మ‌నే చెప్పాలి. మ‌రి.. `గ‌ని`, `స‌ర్కారు వారి పాట‌`లో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న న‌దియా.. రాబోయే  `అంటే.. సుంద‌రానికీ`, `ద వారియ‌ర్`లోనూ మెస్మ‌రైజ్ చేస్తారేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com