![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజకు ఈ ఏడాది ఆయన పుట్టినరోజు మెమొరబుల్ అవుతుందనటంలో సందేహమే లేదు. ఎందుకంటే డిసెంబర్ 23న విడుదలైన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసింది. ఈ సక్సెస్‌పై రవితేజ్ అండ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే జోరులోనే చిరంజీవితో కలిసి రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి సందడి చేయనుంది. ఇందులోనూ రవితేజ పాత్ర కచ్చితంగా ఫ్యాన్స్‌కి నచ్చుతుందనే కాన్ఫిడెన్స్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో రవితేజ ఫ్యాన్స్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో ట్రీట్ ఇవ్వబోతున్నారట. అది కూడా రవితేజ పుట్టినరోజుకి.
అసలు విషయంలోకి వెళితే రవితేజ పుట్టినరోజు జనవరి 26.. అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరి హర వీర మల్లు సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. టీజర్ విడుదల చేయబోతున్నామని నిర్మాత ఎ.ఎం.రత్నం చెప్పేశారు. నెట్టింట దానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్, రవితేజ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇది పలు సందర్భాల్లో బయటపడింది. యాదృచ్చికమైనప్పటికీ ఫ్రెండ్ రవితేజ పుట్టినరోజున పవన్ కళ్యాణ్ తన మూవీ హరి హర వీర మల్లు సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తున్నారు. హరి హర వీర మల్లు చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు.
![]() |
![]() |