![]() |
![]() |

మ్యాచో స్టార్ గోపీచంద్ కి అచ్చొచ్చిన దర్శకుల్లో శ్రీవాస్ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన `లక్ష్యం` (2007), `లౌక్యం` (2014) చిత్రాలు ఘనవిజయం సాధించడమే కాకుండా నటుడిగా గోపీచంద్ కి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. కట్ చేస్తే.. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారు.
ఇదిలా ఉంటే.. గోపీచంద్ - శ్రీవాస్ హ్యాట్రిక్ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఈ సినిమాలోని సింహభాగం సన్నివేశాలు కోల్ కతా నేపథ్యంలో సాగుతాయట. అంతేకాదు.. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, గోపీచంద్ తాజా చిత్రం `సీటీమార్` రేపు (సెప్టెంబర్ 10) థియేటర్స్ లో సందడి చేయనుంది. మరోవైపు మారుతి దర్శకత్వంలో నటిస్తున్న `పక్కా కమర్షియల్` చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. `లౌక్యం` తరువాత సరైన విజయం లేకపోవడంతో ఈ రెండు చిత్రాలపై భారీ ఆశలే పెట్టుకున్నాడు గోపీచంద్.
![]() |
![]() |