![]() |
![]() |

గత ఏడాది దీపావళికి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా!`)తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు సూర్య. త్వరలో ఈ వెర్సటైల్ స్టార్ రెండు సినిమాలతో పలకరించబోతున్నారు. `జై భీమ్` టైటిల్ తో రూపొందిన సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుండగా.. `ఎదర్కుమ్ తుణిందవన్` పేరుతో తెరకెక్కుతున్న చిత్రం క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `అసురన్` ఫేమ్ వెట్రిమారన్ దర్శకత్వంలో `వాడివాసల్` పేరుతో సూర్య ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనుందట. సూర్య కెరీర్ లో 40వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాని వి క్రియేషన్స్ సంస్థ అధినేత కలైపులి ఎస్. థాను నిర్మించబోతున్నారు. కాగా, సూర్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమా హరప్పా - సింధు నాగరికత నేపథ్యంలో సాగుతుందని.. అందుకే ఈ పిరియడ్ డ్రామాకి భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు టాక్.
మరి.. సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న `వాడివాసల్`.. తనకు ఎలాంటి ఫలితాన్ని, గుర్తింపుని అందిస్తుందో చూడాలి.
![]() |
![]() |