![]() |
![]() |

ఇండియాలో ఉన్న దిగ్గజ నటుల్లో ఒకరిగా కమల్ హాసన్ పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ స్థాయికి వెళ్తారని ఆయన సన్నిహితులు కూడా ఊహించి ఉండరు. కానీ రెబల్ స్టార్ కృష్ణంరాజు మాత్రం కమల్ పెద్ద స్థాయికి వెళ్తారని ముందే ఊహించారు. ఆయన ఊహినట్లుగానే కమల్ బిగ్ స్టార్ గా ఎదిగారు.
సినీ పరిశ్రమలో కృష్ణంరాజుకి ఎంతో గొప్ప పేరుంది. ఆయన పెద్ద నటుడైనా కొంచెం కూడా అహం చూపించేవారు కాదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో మంచిగా మెలిగేవారు. తోటి హీరోల సినిమాలలో విలన్ గా, సహాయ నటుడిగా నటించడానికి కూడా ఆయన వెనకాడేవారు కాదు. అలాగే కొత్త ప్రతిభను గుర్తించడంలోనూ ఆయన ముందుండేవారు.
కృష్ణంరాజు హీరోగా నటించిన 'ఇంటి దొంగలు' సినిమాకి కమల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశాడట. ఆ సమయంలో కమల్ ప్రతిభకు ముగ్దుడైన రెబల్ స్టార్.. "నువ్వు ఎప్పటికైనా గొప్ప స్థాయికి వెళ్తావురా" అనేవారట. ఆయన అన్నట్లుగానే కొంతకాలానికి కమల్ పెద్ద హీరోగా ఎదిగారు. 'ఇంటి దొంగలు' సమయం నుంచే కృష్ణంరాజుని "అన్నగారు" అని పిలుస్తూ కమల్ ప్రత్యేక అభిమానం చూపించేవారట.
![]() |
![]() |