![]() |
![]() |

సూపర్‌స్టార్ రజినీకాంత్ చిన్నకుమార్తె సౌందర్య రజినీకాంత్‌కు పండంటి బిడ్డ జన్మించాడు. సౌందర్య, విశాఖన్ దంపతులకు ఇదే తొలి సంతానం. ఈ బాబుకు వారు 'వీర్ రజినీకాంత్' అనే పేరు పెట్టారు. అయితే మొదటి భర్త అశ్విన్ రామ్‌కుమార్ ద్వారా సౌందర్యకు ఇదివరకే వేద్ కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. ఆదివారం రాత్రి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన కొన్ని ఫొటోలతో పాటు నవజాత శిశువుకు సంబంధించిన ఒక గ్లింప్స్‌ను కూడా షేర్ చేసింది సౌందర్య.
"పుష్కలంగా దేవుళ్ల దయతో పాటు, మా అమ్మానాన్నల ఆశీస్సులతో.. వేద్ చిన్న తమ్ముడిని స్వాగతిస్తున్నందుకు విశాఖన్, వేద్, నేను థ్రిల్ ఫీలవుతున్నాం.. ఈరోజు 11.9.22న వీర్ రజినీకాంత్ వనంగమూడి పుట్టాడు".. అని ఆమె రాసుకొచ్చింది. దాంతో పాటు తనకు కాన్పు చేసిన డాక్టర్లకు థాంక్స్ చెప్పింది సౌందర్య.
ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని అయిన విశాఖన్ వనంగమూడిని 2019లో పెళ్లాడింది సౌందర్య. ఇది సౌందర్యకు, విశాఖన్.. ఇద్దరికీ రెండో వివాహమే. మొదటి భర్త అశ్విన్ రామ్‌కుమార్‌తో వచ్చిన విభేదాల కారణంగా 2017లో అతనికి విడాకులిచ్చింది సౌందర్య.
![]() |
![]() |