![]() |
![]() |

కొంతకాలంగా వరుస పరాజయాలను మూటగట్టుకున్న శర్వానంద్ కు 'ఒకే ఒక జీవితం' రూపంలో భారీ ఊరట లభించింది. పెద్దగా అంచనాల్లేకుండా సెప్టెంబర్ 9న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. షో షోకి కలెక్షన్లను పెంచుకుంటూ హిట్ దిశగా పయనిస్తోంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'ఒకే ఒక జీవితం'.. మొదటిరోజు 75 లక్షల షేర్ రాబట్టగా, రెండోరోజు రూ.1.10 కోట్ల షేర్ తో సత్తా చాటింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో రూ.1.85 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పటిదాకా నైజాంలో 97 లక్షల షేర్(బిజినెస్ 2.5 కోట్లు), సీడెడ్ లో 14 లక్షల షేర్(బిజినెస్ 80 లక్షలు), ఆంధ్రాలో 74 లక్షల షేర్(బిజినెస్ 3.20 కోట్లు) రాబట్టింది.
రెస్టాఫ్ ఇండియా 25 లక్షల షేర్, ఓవర్సీస్ లో 75 లక్షల షేర్ కలిపి వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో రూ.2.85 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవరాల్ గా రూ.7.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ మొదటి రోజు రూ.1.30 కోట్ల షేర్, రెండో రోజు రూ.1.55 కోట్ల షేర్ రాబట్టి, బ్రేక్ ఈవెన్ కి ఇంకా 5 కోట్ల దూరంలో ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో మరో 1.50 నుంచి 2 కోట్ల దాకా షేర్ రాబట్టే ఛాన్స్ ఉంది.
![]() |
![]() |