![]() |
![]() |

అగ్ర హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే బెనిఫిట్ షోల నుంచే హడావుడి మొదలైపోతుంది. ఈ సంక్రాంతికి వస్తున్న నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణికి మాత్రం బెనిఫిట్ షోలు లేవని తెలుస్తోంది. ఈనెల 12న గౌతమి పుత్ర ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 11 అర్థరాత్రి నుంచి ఫ్యాన్స్ షోలు ఉంటాయేమో అని అభిమానులు ఆశపడ్డారు. కానీ.. బాలయ్య మాత్రం `బెనిఫిట్ షోలు వద్దు` అని గట్టిగా చెప్పాడట. 12వ తారీఖున సినిమాని ఏ టైమ్‌లో ప్రదర్శించాలన్న విషయంలో బాలయ్య ఓ ముహూర్తం ఫిక్స్ చేశాడని, దానికి ఒక్క నిమిషం ముందు కూడా షో పడే అవకాశాలు లేవని తెలుస్తోంది.
అయితే ఓవర్సీస్‌లో మాత్రం 11నే ప్రీమియర్లు మొదలైపోతాయి. చిరంజీవి ఖైదీ నెం.150కి మాత్రం వేరే ప్లానులున్నాయి. అన్ని చోట్లా అర్థరాత్రి షోలు వేయాలని, ఫ్యాన్స్ కోసం వీలైనన్ని షోలు ప్రదర్శించాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. అందుకోసం అనుమతులు తీసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాడని తెలుస్తోంది. తెలంగాణ సర్కారు నుంచి చరణ్‌కి ఎలాంటి ఇబ్బందులూ ఉండకపోవొచ్చు. ఎందుకంటే చరణ్‌కి కేటీఆర్‌తో మంచి సంబంధాలున్నాయి. అందుకే.. ఇక్కడి నుంచి అనుమతులు రావడం ఖాయం. మరి ఏపీ సంగతేంటన్నది తేలాల్సివుంది.
![]() |
![]() |