![]() |
![]() |

అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ తెచ్చుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా తాజాగా 50 కోట్ల క్లబ్ లో చేరింది.
మొదటి హిట్ కోసం తపిస్తున్న అక్కినేని యువ హీరో అఖిల్ కి.. తను హీరోగా నటించిన నాలుగో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో సూపర్ హిట్ దక్కింది. ఈ సినిమా అఖిల్ కి ఫస్ట్ హిట్ ని అందించడమే కాకుండా.. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. పెళ్లి తర్వాత జీవితం అందంగా ఉండాలంటే రొమాన్స్ కూడా ఉండాలి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. అఖిల్, పూజ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లుగా తెలియజేస్తూ తాజాగా మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అఖిల్ కి సాలిడ్ హిట్ పడటంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు.
![]() |
![]() |