![]() |
![]() |

కన్నడ స్టార్ హీరో యశ్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. బెంగళూరులోని ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్మెంట్స్లో యశ్ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ మేరకు యశ్-రాధికా దంపతులు గురువారం నూతన గృహంలోకి అడుగుపెట్టి.. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
యశ్ దంపతులు గురువారం ఉదయం గృహ ప్రవేశ వేడుకను నిర్వహించి కుటుంబ సమేతంగా కొత్తింటిటోకి అడుగుపెట్టారు. ఈ నూతన గృహప్రవేశ వేడుకలో యశ్, రాధికల తల్లిదండ్రులతోపాటు అత్యంత ఆప్తులు మాత్రమే పాల్గొన్నారు.

కాగా 'కేజీఎఫ్' సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. త్వరలో ఈ సినిమా రెండో భాగం 'కేజీఎఫ్-2' ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.
![]() |
![]() |