![]() |
![]() |

బాహుబలి తర్వాత రచయిత విజయేంద్ర ప్రసాద్ స్థాయి మరింత పెరిగింది. ఆయన రాసిన స్టొరీతో సినిమా చేయడానికి నేషనల్ వైడ్ గా ఎందరో స్టార్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఓ వైపు తనయుడు రాజమౌళి సినిమాలకు కథలు అందిస్తూనే.. మరోవైపు బాలీవుడ్, కోలీవుడ్ లలో పలు భారీ బడ్జెట్ సినిమాలకు కథలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, సీత, తలైవి సినిమాలకు రచయితగా పని చేస్తున్న ఆయన.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేశారని తెలుస్తోంది.
విజయేంద్ర ప్రసాద్ కి పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. పవన్ మీద తనకున్న ఇష్టాన్ని ఇంటర్వ్యూలలోను, స్టేజి పైన పలు సందర్భాల్లో బయటపెట్టారు. పవన్ లాంటి పవర్ ఫుల్ స్టార్ ని తాను చూడలేదని.. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు జనాలు ఎగబడి చూస్తారని అన్నారు. అంతేకాదు బాహుబలి ఇంటర్వెల్ సీన్ ని పవన్ కి ఉన్న క్రేజే ఇన్స్పిరేషన్ అని చెప్పారు. పవన్ మీద అంతటి అభిమానం ఉన్న విజయేంద్ర ప్రసాద్.. ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ చేశారని తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ ని పవన్ కి వినిపించగా.. వెంటనే పవన్ కూడా ఓకే చెప్పారని సమాచారం.
ప్రస్తుతం పవన్ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'హరిహర వీరమల్లు'లో నటిస్తున్నారు. ఆ తరువాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. అనంతరం విజయేంద్ర ప్రసాద్ కథతో సినిమా తెరకెక్కే అవకాశముంది. మరి దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి.
![]() |
![]() |