![]() |
![]() |

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి కాజల్ కి, ఆమె భర్త గౌతమ్ కిచ్లుకి సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమకు మగబిడ్డ పుట్టినట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలిపిన గౌతమ్.. అలాగే కొడుకు పేరుని కూడా రివీల్ చేశాడు.
ఏప్రిల్ 19 న తమకు మగబిడ్డ పుట్టాడని, 'నీల్ కిచ్లు' అనే పేరు పెట్టామని తెలుపుతూ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు గౌతమ్. తమ పట్ల ప్రేమ చూపించి ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం 'నీల్ కిచ్లు' పేరు ట్విట్టర్ లో ట్రెండింగ్ మారింది. 'నీల్' అంటే 'ఛాంపియన్', 'విక్టరీ' వంటి అర్థాలు వస్తాయి.

కాగా 2020 అక్టోబర్ 30న తన స్నేహితుడు, ముంబై వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును కాజల్ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన కాజల్.. ప్రెగ్నెన్సీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. చిరంజీవి సరసన ఆమె నటించిన 'ఆచార్య' మూవీ ఏప్రిల్ 29 న విడుదల కానుంది.
![]() |
![]() |