![]() |
![]() |

విజయశాంతి (vijayashanti)నోటి వెంట బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య జో కొట్టాలయ్య అని వస్తే..స్టేట్ మొత్తం పూనకంతో ఊగిపోయింది.ఇలా ఎన్నో సార్లు తెర మీద బాలయ్య,విజయ శాంతి కాంబో చూసి అభిమానులు, ప్రేక్షకులు ఊగిపోయారు. అంతటి శక్తీ ఉంది ఆ ఇద్దరి కాంబో కి. ఇక బాలయ్య తో తన సినిమాలు ఎందుకు ఆగిపోయాయో అనే రీజన్ ని విజయశాంతి చెప్పింది.
బాలయ్య పక్కన హీరోయిన్ గా ఉంటే విజయశాంతే ఉండాలి..విజయశాంతి కి హీరోగా బాలయ్యే ఉంది. ఇది నిజమని ఆ ఇద్దరు కలిసి చేసిన సినిమాలు చూస్తే చెప్తారు.అసలు విషయానికి వస్తే బాలయ్య, విజయశాంతి కాంబోలో చివరిగా వచ్చిన సినిమా నిప్పు రవ్వ. 1993 లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఎలాంటి సినిమా తెరకెక్కలేదు. అభిమానులతో పాటు ప్రేక్షకులు రకరక కారణాలు చెప్పారు. కానీ ఇప్పుడు విజయ శాంతే అసలు నిజం చెప్పింది.బాలకృష్ణగారితో నిప్పురవ్వ తరువాత చెయ్యక పోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. ఆ మూవీ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యాల్సి వచ్చింది. వరుసగా అలాంటి సినిమాలే వచ్చాయి.నేను కూడా సైన్ చేసుకుంటూ వెళ్ళాను. పైగా ఒక దానిని మించి ఒకటి విజయం సాధించాయి. అది ఎంతలా అంటే హీరో స్థాయి సినిమాలతో సమానంగా ఆడేవి.లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరో ఇమేజ్ వస్తుందనీ, దాంతో యాక్షన్ సినిమాలు చేసుకుంటూ వెళ్తానని , అంత బిజీ అవుతానని కూడా అనుకోలేదు. అందువల్లనే బాలకృష్ణ తో గాని ఇతర హీరోలతో గాని చేయలేకపోయాను అని చెప్పుకొచ్చింది. ఆ టైం లో హీరోలతో పాటు సమానంగా పారితోషికం కూడా తీసుకుంది.
విజయశాంతి బాలకృష్ణ (balakrishna)కాంబోలో మొత్తం పదిహేడు సినిమాలు తెరకెక్కాయి. 1984 లో వచ్చిన కధానాయకుడు తొలి సినిమా. పట్టాబిషేకం, దేశోద్ధారకుడు, ఇన్ స్పెక్టర్ ప్రతాప్, ముద్దుల కృష్ణయ్య ,అపూర్వ సహోదరులు, లారీ డ్రైవర్, భలే దొంగ, రౌడీ ఇన్ స్పెక్టర్ ,ముద్దుల మావయ్య లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. అభిమానులైతే ఇద్దరి కాంబోలో మళ్ళీ సినిమా వస్తే బాగుండని అనుకుంటున్నారు. బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషిస్తే పెద్ద బాలకృష్ణ కి విజయశాంతి చేయచ్చని అంటున్నారు.
![]() |
![]() |