![]() |
![]() |

ఇటీవల థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే మెజారిటీ సినిమాలు ఓటీటీలో అడుగు పెడుతున్నాయి. మరీ అంత త్వరగా ఓటీటీలోకి రావడం కరెక్ట్ కాదని, థియేటర్ల వ్యవస్థ బాగుండాలంటే కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో రెండు వారాలకే ఓటీటీలోకి అడుగు పెడుతూ షాక్ ఇచ్చింది 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari) మూవీ.
విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ యాక్షన్ డ్రామా మే 31న థియేటర్లలో విడుదలైంది. రూ.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. డివైడ్ టాక్ తెచుకున్నప్పటికీ, మంచి వసూళ్లతో బ్రేక్ ఈవెన్ సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా అనూహ్యంగా రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 14 నుంచి తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి, నాజర్, గోపరాజు రమణ, సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
![]() |
![]() |