![]() |
![]() |

భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా యాక్షన్ హీరో అంటే ఎక్కువమందికి గుర్తుకొచ్చే పేరు బ్రూస్ లీ. ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. బ్రూస్ లీ అంటే ఒక బ్రాండ్. ఆయన పంచ్ పవర్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. బ్రూస్ లీ బాడీ షేప్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. పైకి చూడటానికి స్లిమ్ గా కనిపిస్తారు. కానీ, షర్ట్ విప్పితే.. కండలు తిరిగిన దేహంతో పవర్ ఫుల్ గా కనిపిస్తారు. స్లిమ్ బాడీతో అంత పవర్ ఫుల్ గా కనిపించడం ఒక్క బ్రూస్ లీకే చెల్లింది. అలాంటి బ్రూస్ లీతో ఇప్పుడు కొందరు జూనియర్ ఎన్టీఆర్ ను పోలుస్తున్నారు. టాలీవుడ్ బ్రూస్ లీ అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. (Jr NTR in Bruce Lee look)
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా స్లిమ్ అయ్యాడు. మొదట ఆయన లుక్ చూసి అందరూ షాకయ్యారు. ప్రశాంత్ నీల్ సినిమా అంటే భారీ యాక్షన్ ఉంటుంది, హీరో బీస్ట్ లుక్ లో కనిపించాలి. అలాంటిది, ఎన్టీఆర్ స్లిమ్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆయన స్లిమ్ అవ్వడానికి కారణమేంటో తాజాగా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. 'డ్రాగన్' కోసం ఎన్టీఆర్.. బ్రూస్ లీ తరహా లుక్ లో కనిపించబోతున్నాడు.
'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను తాజాగా విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. ఆయన బాడీ షేప్ బ్రూస్ లీని గుర్తు చేస్తుందంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇంకా కొందరైతే ఎన్టీఆర్, బ్రూస్ లీ ఫొటోలను పక్కపక్కన పెట్టి.. 'టాలీవుడ్ బ్రూస్ లీ వచ్చేశాడు' అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. 'డ్రాగన్'లో ఎన్టీఆర్ షర్ట్ లెస్ యాక్షన్ సీన్ చేస్తే థియేటర్లు తగలబడతాయని, ఆ ఒక్క సీన్ కే 'పోతారు మొత్తం పోతారు' అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

![]() |
![]() |