![]() |
![]() |

'షైన్ టామ్ చాకో( shine tom chacko), విన్సీ అలోషియస్'( Vincy Aloshious).. ఈ ఇద్దరు కొన్ని రోజుల క్రితం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. షూటింగ్ టైం లో డ్రగ్స్ తీసుకొని షైన్ నన్ను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకి గురి చేసాడని విన్సీ తన ఆవేదనని మీడియా సమక్షంగా వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు షైన్ ని అరెస్ట్ చేసారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకి వచ్చాడు. విన్సీ ప్రెస్ మీట్ నిర్వహించి షైన్ ని సమర్దిస్తు మాట్లాడింది. ఇదంతా ఈ ఏడాది ఏప్రిల్, మే మధ్యన జరిగింది. ఆ తర్వాత వీళ్లిద్దరు జంటగా నటించిన 'సూత్రవ్యాక్యం' జులై 11 న రిలీజై మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు, షైన్, విన్సీ ల పెర్ ఫార్మెన్స్ కి కూడా,ప్రేక్షకులు నీరాజనాలు పలికారు.
ఇక 'సూత్రవ్యాక్యం'(Soothravakyam)ఆగస్టు 21 నుంచి మళయాళంతో పాటు, పాన్ ఇండియా రేంజ్ లో 'తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో 'ఓటిటి' ద్వారా స్ట్రీమింగ్ కి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ కి వచ్చిన సూత్ర వ్యాక్యం 'వంద మిలినియన్'స్ట్రీమింగ్ మినిట్ యూనిట్స్ ని అందుకొని, ఓటిటి కి సంబంధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక రకంగా ఇది అరుదైన రికార్డు అని చెప్పవచ్చు. మరి ముందు ముందు వ్యూయర్స్ పరంగా ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. వంద మిలినియన్'స్ట్రీమింగ్ మినిట్ యూనిట్స్ ని అధికారంగా తెలియచేస్తు, 'అమెజాన్ ప్రైమ్' ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
షైన్ ఈ చిత్రంలో 'క్రిస్టో జేవియర్' అనే పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ పోషించాడు. పోలీసులని చూసి ప్రజలు ఇంకా ఎందుకు భయపడాలి, పోలీస్ స్టేషన్ కి నేరాలు చేసిన వాళ్లు, బాధితులు మాత్రమే
ఎందుకు వెళ్లాలని క్రిస్టో భావిస్తాడు. దీంతో ఖాళీ సమయంలో, పదకొండు తరగతి చదివే పిల్లకి స్టేషన్ లోనే ట్యూషన్స్ చెప్తుంటాడు. ఈ క్రమంలో 'ఆర్య' అనే స్టూడెంట్ ని ఆమె అన్నయ్య వివేక్ వేధిస్తుంటాడు. దీంతో వివేక్ కి షైన్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత వివేక్ చనిపోతాడు. ఈ కేసుని పరిశోధన చేసే క్రమంలో ఇంకో యువతీ హత్య కేసు బయటపడుతుంది. ఇలా అనుక్షణం ఎంతో ఉత్కంఠభరితంగా,ఊహకి అందని స్క్రీన్ ప్లే తో సూత్ర వ్యాక్యం రన్ అవుతు సరికొత్త థ్రిల్ ని కలిగిస్తుంది. నిమిషా అనే టీచర్ క్యారక్టర్ లో 'విన్సీ కనిపించగా, జొస్ చిరామెల్( Eugien Jos Chirammel)దర్శకత్వం వహించాడు. సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగు నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల(Srikanth Kandragula)నిర్మించాడు. మూవీ నిడివి 112 నిమిషాలు.

![]() |
![]() |