![]() |
![]() |

ఈ దసరా మెగా అభిమానులకు అసలుసిసలైన సినీ పండుగ కాబోతుంది. దసరాకి ఒక వారం ముందుగానే సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఓజీ' విడుదలవుతోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఈ దసరాకి 'ఓజీ' సినిమాతో పాటు, మెగా ఫ్యాన్స్ కి రెండు సర్ ప్రైజ్ లు రాబోతున్నాయి. వాటిలో ఒకటి చిరంజీవి చిత్రానికి సంబంధించినది కాగా, మరొకటి రామ్ చరణ్ సినిమాకి సంబంధించినది. (They Call Him OG)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' చేస్తుండగా, బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ 'పెద్ది' చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల నుంచి మొదటి పాటలు దసరా కానుకగా విడుదల కానున్నాయి. (Mana Shankara Varaprasad Garu)
ఏఆర్ రెహమాన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న 'పెద్ది' నుండి ఫస్ట్ సింగిల్ అక్టోబర్ 2న విడుదల కానుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' నుంచి ఫస్ట్ సింగిల్ అక్టోబర్ 3న రిలీజ్ కానుందని సమాచారం. (Peddi)
ఓ వైపు థియేటర్లలో 'ఓజీ' రికార్డుల మోత, మరోవైపు బయట 'పెద్ది', 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాల పాటల మోతతో.. ఈ దసరా మెగా అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతుంది.
![]() |
![]() |