![]() |
![]() |

గతేడాది 'దేవర'తో అలరించిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో పాటు, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'డ్రాగన్' మూవీ చేస్తున్నాడు. వీటి తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. (NTR Nelson Movie)
తక్కువ సినిమాలతోనే కోలీవుడ్ లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నెల్సన్. ముఖ్యంగా రజినీకాంత్ తో చేసిన 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం 'జైలర్-2'తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత నెల్సన్ చేయబోయే మూవీ.. ఎన్టీఆర్ తోనే అని తెలుస్తోంది. నెల్సన్ గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట. అంతేకాదు, ఈ సినిమాకి 'రాక్' (Rock) అనే టైటిల్ ను లాక్ చేసినట్లు వినికిడి. ఈ మూవీ 2026 లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది.
ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల్లో 'వార్-2' ఆగస్టులో విడుదల కానుంది. 'డ్రాగన్' 2026 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా, వేసవికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 'రాక్', 'దేవర-2' పట్టాలెక్కనున్నాయి.
![]() |
![]() |