![]() |
![]() |

ఇస్మార్ శంకర్ హీరోయిన్ 'నిధి అగర్వాల్'(Nidhhi Agerwal)ప్రస్తుతం 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)తో హరిహరవీరమల్లు(Hari Hara veeramallu)'ప్రభాస్' (Prabhas)తో ది రాజాసాబ్(The raja saab)లాంటి భారీ ప్రాజెక్ట్స్ లో చేస్తున్న విషయం తెలిసిందే.ఒకేసారి ఇద్దరి బడా హీరోలతో జత కట్టడంతో పాటు రెండు సినిమాల షూటింగ్ లోను ఒకేసారి పాల్గొంటు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
రీసెంట్ గా ఆమె ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతు పవన్ కళ్యాణ్ గారితో 'హరిహరవీరమల్లు'లో కలిసి చెయ్యడం మర్చిపోలేని అనుభూతి. ఆయన గొప్ప మేధావి తో పాటు చాలా ధైర్య వంతుడు.సాహిత్యంపై కూడా మంచి పట్టు ఉంది.ఎన్నికల్లో గెలిచి,డిప్యూటీ సి ఎం అవ్వకముందు ఏ విధంగా అయితే షూటింగ్ లో పాల్గొన్నారో, డిప్యూటీ సిఎం అయ్యాక కూడా అదే విధంగా షూటింగ్ లో పాల్గొంటు వస్తున్నారు.ఎలాంటి మార్పు లేదు. మూవీలోని క్యారక్టర్ కోసం రెండు నెలలు పాటు గుర్రపు స్వారీతో పాటు కథక్, భరత నాట్యంలో శిక్షణ తీసుకున్నానని చెప్పుకొచ్చింది
ఇక ఇదే ఇంటర్వ్యూ లో 'రాజాసాబ్' గురించి చెప్పుకొస్తు నేను రాజాసాబ్ లో దెయ్యం క్యారక్టర్ లో నటిస్తున్నాననే వార్తలు వస్తున్నాయి.ఆ వార్తలన్నీ అబద్దం.నా క్యారక్టర్ చాలా వినోదాత్మకంగా సాగుతునే పలువురిని ఆశ్చర్య పరుస్తుంది.ప్రభాస్ సెట్ లో చాలా సరదాగా ఉంటూ అందర్నీ నవ్విస్తాడని చెప్పుకొచ్చింది.
![]() |
![]() |