![]() |
![]() |
.webp)
అక్కినేని నాగార్జున(Nagarjuna)ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'కుబేర'(Kubera)చేస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల(Shekar Kammula)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో తమిళ(Tamila)స్టార్ హీరో ధనుష్ (Dhanush)కూడా ఒక హీరోగా చేస్తుండగా జూన్ 20 న కుబేర వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.నాగ్ ఖాతాలో మరో పాన్ ఇండియా మూవీ 'కూలీ' (Coolie)కూడా ఉన్న విషయం తెలిసిందే.రజనీకాంత్, లోకేష్ కనగరాజ్(lokesh Kanagaraj)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో 'సైమన్' అనే ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ లో నాగ్ కనిపించబోతున్నాడు.మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజైన సైమన్ లుక్ విభిన్నంగా ఉండటంతో నాగ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా కూలి పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
నాగ్ కి రీసెంట్ గా ప్రముఖ అగ్ర దర్శకుడు 'పూరి జగన్నాధ్'(Puri Jagannadh)ఒక కథ చెప్పాడని,ఆ స్టోరీ లైన్ నాగ్ కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ కాంబోలో ఇప్పటికే శివమణి,సూపర్ లాంటి విభిన్న చిత్రాలు వచ్చి ప్రేక్షాదరణ పొందటంతో ఈ ఇద్దరి కాంబోలో మూవీ రావడం ఖాయమైతే కనుక ఎలాంటి సబ్జెట్ తో తెరకెక్కబోతుందనే ఆసక్తి అందరిలో ఉంది.విక్టరీ వెంకటేష్(Venkatesh)అఖిల్ అక్కినేని(Akhil Akkineni)తో కూడా పూరి సినిమాలు చేయబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

![]() |
![]() |