![]() |
![]() |
.webp)
ప్రపంచ సినీ పితామహుడిగా కీర్తించబడే దర్శకుడు జేమ్స్ కామెరూన్.(James cameron)ఆయన దర్శకత్వం నుంచి వచ్చిన ప్రతి సినిమా 8 thవండర్ గా ప్రపంచ సినీ ప్రేమికుల్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోతుంది.అలాంటి వండర్స్ లో అవతార్ కూడా ఒకటి.గ్రహాంతర వాసుల నేపథ్యంలో తెరకెక్కిన అవతార్(Avatar) ఇప్పటికి రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాగా, రెండవ భాగానికి చెందిన కథ,కథనాలు అయితే భారతీయతకి దగ్గరగా తెరకెక్కడం విశేషం. అవతార్ 3 కూడా చిత్రీకరణ దశలో ఉండగా ఈ ఏడాది డిసెంబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీసెంట్ గా ఒకప్పటి బాలీవుడ్ అగ్ర హీరో గోవిందా(Govinda)అవతార్ మూవీ గురించి మాట్లాడుతు అమెరికాలో జేమ్స్ కామెరూన్ ని కలిసి డిన్నర్ కూడా చేశాను.ఆ సమయంలో అవతార్ లో అవకాశం గురించి చెప్పి మూవీలోని స్పైడర్ క్యారెక్టర్ లో చేస్తే 18 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తాం.400 రోజుల దాకా షూటింగ్ ఉంటుంది.కాకపోతే శరీరానికి పెయింటింగ్ వేసుకోవాల్సి వస్తుందని చెప్పారు.దాంతో నేను కామెరూన్ గారితో మీ 18 కోట్లు వద్దు.ఆ విధంగా ఒంటి నిండా పెయింట్ వేసుకుంటే నేను తర్వాత హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వస్తుందని చెప్పాను.కానీ సినిమా రిలీజ్ అయ్యాక స్పైడర్ క్యారక్టర్ లో నటించిన నటుడ్ని చూసీ ఆశ్చర్యపోయాను.అవతార్ టైటిల్ కూడా నేనే సూచించానని గోవింద చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా మారాయి.
1986లో విడుదలైన ఇల్జామ్ అనే చిత్రం ద్వారా హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసిన గోవిందా సుమారు 160 కి పైగా చిత్రాల్లో నటించి అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరించాడు.1999 వ సంవత్సరం లో బిబిసి నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో గోవిందా 10వ గ్రేటెస్ట్ స్టార్ ఆఫ్ స్టేజ్ ఆర్ స్క్రీన్ గా కూడా ఎన్నుకోబడ్డాడు.ఆంఖే,రాజా బాబు,కూలీ నెం.1 ,హీరో నెం.1,హసీనా మాన్ జాయేగీ, జాన్ సే ప్యారా,బడేమియా చోటేమియా, అనారీ నెం.1 , భగమ్ భాగ్, పార్ట్ నర్, లైఫ్ పార్ట్ నర్, రావన్, హధ్ కర్ దీ ఆప్నే వంటి చిత్రాల్లో నటించాడు. 'హధ్ కర్ దీ ఆప్నే' లో అయితే ఆరు క్యారెక్టర్స్ లో చేసిన గోవిందా 2014లో ఉత్తర ముంబై నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున ఎంపిగా పని చేసాడు.ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాడు.

![]() |
![]() |