![]() |
![]() |

ఇతర భాషలకు చెందిన భారీ సినిమాలకు కూడా తెలంగాణలో టికెట్ ధరల పెంపుకి అనుమతి లభిస్తోంది. గతంలో కన్నడ మూవీ 'కేజీఎఫ్-2' కి కేసీఆర్ సర్కార్ టికెట్ హైక్ కి అనుమతి ఇచ్చింది. ఇప్పుడదే బాటలో తమిళ మూవీ 'ఇండియన్-2' (భారతీయుడు-2) కి రేవంత్ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. (Indian 2)
'భారతీయుడు-2' సినిమా జూలై 12న విడుదలవుతోంది. తెలంగాణలో ఈ చిత్రానికి మొదటి వారం రోజుల పాటు (జూలై 12 నుంచి జూలై 19 వరకు) ఐదవ షోకి, టికెట్ ధరల పెంపుకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కో టికెట్ పై మల్టీప్లెక్స్ లలో రూ.75, సింగిల్ స్క్రీన్స్ రూ.50 వరకు పెంచుకోవచ్చు.
డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని.. అటువంటి వారికి టికెట్ ధరల పెంపుకి అనుమతి ఇస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ కండిషన్ కి 'ఇండియన్-2' టీం అంగీకరించడంతో.. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అయితే టికెట్ ధరల పెంపు అనేది 'భారతీయుడు-2' కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. 'కేజీఎఫ్-2' మాస్ సినిమా. పైగా సీక్వెల్ హైప్ తో టికెట్ ధరతో సంబంధం లేకుండా ప్రేక్షకులు చూశారు. 'ఇండియన్-2' కూడా సీక్వెల్ అయినప్పటికీ.. మొదటి భాగం ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చింది. పైగా కమల్ హాసన్-డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ కి రావాల్సినంత హైప్ రాలేదు. ఈ క్రమంలో టికెట్ హైక్ మొదటికే మోసం అవుతుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
![]() |
![]() |