![]() |
![]() |

ఫ్యామిలీకి తగినంత సమయం కేటాయించే స్టార్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ముందు వరుసలో ఉంటారు. షూటింగ్స్ మధ్యలో ఏమాత్రం విరామం దొరికినా.. ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లడం మహేష్ కి అలవాటు. ఇటీవల కుటుంబంతో జర్మనీ వెళ్ళాడు. ఈ సందర్భంగా దిగిన ఓ ఫోటోని తాజాగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి మహేష్ దిగిన ఈ ఫోటో ఎంతో క్యూట్ గా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమాల విషయానికొస్తే, మహేష్ తన తదుపరి చిత్రాన్ని ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు. మహేష్ కెరీర్ లో 29 సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ (SSMB 29)ని కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ చిత్రం లాంచ్ అయ్యే అవకాశముంది.

![]() |
![]() |