![]() |
![]() |
.webp)
కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్(raj tarun)లావణ్య(lavanya)ల మ్యాటర్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. లావణ్య మీడియా ముందుకొచ్చి రాజ్ తరుణ్ నాతో పదకొండేళ్ళుగా సహజీవనం చేసాడు. కానీ ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయం టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
రాజ్ తరుణ్, తనకి మధ్య జరిగిన వాటన్నింటిని లావణ్య పోలీసులకి అందించింది. దీంతో వాటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు రాజ్ తరుణ్ మీద కేసు నమోదు చేసారు. ఐపిసి 493 తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. 170 ఫొటోలతో పాటు మరికొన్ని టెక్నీకల్ ఎవిడెన్స్ ని కూడా లావణ్య ఇచ్చింది. ఇక రాజ్ తరుణ్ తో పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని ఒక సారి అబార్షన్ కూడా చేయించాడని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆ హాస్పిటల్ వివరాలు కూడా పోలీసులకి అందించింది. అదే విధంగా తనని రెచ్చగొట్టి ఆడియో రికార్డు కూడా చేసాడని చెప్పడంతో పాటుగా మాల్వి మల్హోత్రా(malvi malhotra)తో కలిసి విదేశాలకి వెళ్లే ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించింది. గతంలో ఒకసారి అన్వీక పేరుతో నన్ను విదేశాలకి కూడా తీసుకెళ్లాడని కూడా చెప్పుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పి ఎస్ లో కేసు నమోదు అయ్యింది.
![]() |
![]() |