![]() |
![]() |

'అల వైకుంఠపురములో' చిత్రంలో 'బంటు' అనే పేరు విని "ఇది పేరా.. ఇదే పేరా" అని పూజారి ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు యువ హీరో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ టైటిల్ తెలిసి.. అందరూ అలాగే ఆశ్చర్యపోతున్నారు.
కిరణ్ అబ్బవరం అప్ కమింగ్ మూవీకి 'క' అనే టైటిల్ పెట్టారు. కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) పేరుకి షార్ట్ ఫామ్ తీసుకొని 'క' (KA) అనే టైటిల్ పెట్టినట్టుగా ఉంది. ఇలా ఒకే అక్షరంతో టైటిల్ ఉండే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడు కిరణ్ సినిమాకి 'క' అనే టైటిల్ అనౌన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇదొక పీరియాడిక్ ఫిల్మ్ అని తెలుస్తోంది.
![]() |
![]() |