![]() |
![]() |

నమ్మండి.. నమ్మకపోండి.. అందంగా, ఆకర్షణీయంగా ఉండే సీనియర్ నటి వై. విజయను ఆమె యంగ్ ఏజ్‌లో, పెళ్లి కాకముందు ఎవరూ ప్రేమించామని కానీ, పెళ్లి చేసుకుంటామని కానీ ఎవరూ ప్రపోజ్ చేయలేదు! నమ్మడం కష్టమైనా.. ఈ విషయం స్వయానా ఆమే చెప్పారు. కెరీర్ ఆరంభంలో హీరోయిన్‌గానూ నటించిన వై. విజయ ఎర్రగా, బుర్రగా ఉంటారని మనకు తెలుసు. పెళ్లయి, ఓ పాపకు తల్లయ్యాక కొంత కాలం సినిమాలకు దూరమై, తిరిగి బాలకృష్ణ 'మంగమ్మగారి మనవడు' సినిమాలో చేసిన పులుసు పాత్రతో ప్రేక్షకుల్ని అలరించి, ఆ తర్వాత అనేక సినిమాలు వరుసగా చేశారామె. ఇటీవల అనిల్ రావిపూడి మూవీ 'ఎఫ్ 2'లో అన్నపూర్ణ కాంబినేషన్‌లో ఆమె మరోసారి తనదైన శైలి నటనతో అలరించారు. నేడు ఆమె పుట్టినరోజు.
ఆమధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఏ హీరో మీదా క్రష్ ఉండేది కాదని ఆమె స్పష్టం చేశారు. "నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. నేనెప్పుడూ ఈ హీరోకి ఫ్యాన్‌ని అని ఎప్పుడూ అనుకోలేదు. ఏ హీరో అయినా ఏ సినిమాలో బాగా చేస్తే, ఈయన చాలా బాగా చేశారు అని అనుకుంటానే కానీ, ఎవరి మీదా క్రష్ ఉండేది కాదు. సినిమా హీరోలంటే నాకు అట్లాంటి అభిప్రాయమే కలగదు" అని చెప్పారు వై. విజయ
అలాగే తనకు ఎవరూ ప్రపోజ్ చెయ్యలేదని ఆమె స్పష్టం చేశారు. "మీ సినిమాలు చూసి అబ్బా అనుకుంటామండీ అనేవాళ్లే అందరూ. ఎవరూ నా దగ్గరకు వచ్చి నన్నేమీ అడగలేదు. మా అమ్మ నా పక్కనే ఉండేది. నా పెళ్లయ్యే వరకూ మా అమ్మ నాతోనే ఉండేది. అలాగే ఏ హీరోని చూసీ అబ్బ ఎంత అందంగా ఉన్నాడో అని నాకెప్పుడూ అనిపించలేదు. మా ఆయన్ని చూసినప్పుడు మాత్రమే అలా అనిపించింది. అది అందం గురించి కాదు, ఆయన క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది." అని చెప్పుకొచ్చారు వై. విజయ.
![]() |
![]() |