![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న నయా మూవీస్ లో ఓ జి కూడా ఒకటి. సాహో సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి పై పవన్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఓజి గ్లింప్స్ తో అయితే అభిమానుల అంచనాలు ఆకాశాన్ని దాటాయి. తాజాగా ఓజి కి సంబంధించి వస్తున్న రూమర్స్ పై నేటితో చెక్ పడింది.
ఓజి ని డివివి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఆర్ఆర్ఆర్ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకున్న ఓజి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హ్యాండ్ ఓవర్ లోకి వచ్చిందని డి వి వి సంస్థే వాళ్లకి అప్పగించిందనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో దానయ్య రంగంలోకి దిగి ఓజి ని వేరే బ్యానర్ నిర్మిస్తుందని వస్తున్న వార్తలపై ఎలాంటి నిజం లేదు.కేవలం అవి రూమర్స్ మాత్రమే ఓజి మా బ్యానర్ కి అత్యంత ప్రతిష్టాత్మక మైన మూవీ అని చెప్పారు. పవన్ కెరీర్ తో పాటు మా బ్యానర్ లో కూడా చిరకాలం గుర్తుండి పోయే రేంజ్ లో ఓ జి మిగిలిపోయేలా అత్యంత భారీ వ్యయంతో అత్యున్నత ప్రమాణాలతో ఓ జి ని నిర్మిస్తున్నాం అని దానయ్య తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

ఓజి లో పవన్ తో పాటు ప్రియాంక మోహన్, శ్రీయ రెడ్డి ,ఇమ్రాన్ హష్మీ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.థమన్ మ్యూజిక్ ని అందిస్తుండగా రవి కె చంద్రన్ కెమెరా భాధ్యతల్ని నిర్వహిస్తున్నాడు.
![]() |
![]() |