![]() |
![]() |

హిమాలయాల శిఖరాల కి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో సూపర్ స్టార్ మహేష్ బాబు( mahesh babu)నటనకి అంతే పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరికి నచ్చేలా నటించడం మహేష్ నటనకి ఉన్న స్పెషాలిటీ తాజాగా ఈ సంక్రాంతికి గుంటూరు కారం అనే మూవీ వస్తుంది. నిన్న విడుదలైన ట్రైలర్ తో సినిమా సూపర్ డూపర్ హిట్ అని ఖాయమైంది
గుంటూరు కారం (guntur kaaram) ట్రైలర్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులని కూడా ఎంతగానో అలరించింది. మహేష్ శ్రీలీల( sreeleela)ని చూసి వేసే పంచులు గాని రౌడీలతో మహేష్ స్మూత్ గా ఇచ్చే వార్నింగ్స్ గాని సూపర్ గా ఉన్నాయి. అలాగే మహేష్ బీడీ వెలిగించే సీన్ అయితే సూపర్ గా ఉంది. ఆ స్టైల్ కి రేపు థియేటర్స్ విజిల్స్ తో మోత మోగిపోవడం గ్యారంటీ. త్రివిక్రమ్(trivikram)
స్టైల్ పంచులు కూడా నెక్స్ట్ లెవల్లో ఉండబోతున్నాయని అర్ధం అవుతుంది.అలాగే శ్రీలీల కూడా చాలా రోజుల తర్వాత ప్రాధాన్యత ఉన్న క్యారక్టర్ లో నటించబోతుందని అర్ధం అవుతుంది. టోటల్ గా చెప్పాలంటే ట్రైలర్ చూస్తున్నంత సేపు గుంటూరు కారంని చూద్దామా అనే ఆసక్తిని కలిగించింది.
మొత్తానికి గుంటూరు కారం ట్రైలర్ తో మహేష్ అభిమానులకి సంక్రాంతి స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు. కాకపోతే సోషల్ మీడియాలో గుంటూరు కారం కథకి సంబంధించిన విషయంలో కొన్ని మీమ్స్ ని ఎదుర్కొంటుంది. 2009 లో సిద్దార్ధ హీరోగా వచ్చిన కొంచం ఇష్టం కొంచం కష్టం సినిమా లైన్ అని అలాగే కీర్తి కెరటాలు అనే నవల కి కాపీ అనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అమ్మగారి ఇంటికి దారేది అనే టైటిల్ తో గుంటూరు కారం ట్రోల్ అవుతుంది. మహేష్ ఫ్యాన్స్ మాత్రం తెలుగు సినిమా రికార్డులకి సంబంధించిన పుస్తకాన్ని గుంటూరు కారం క్లీన్ చేస్తుందని అంటున్నారు.
![]() |
![]() |