![]() |
![]() |

-హేమచంద్ర రియాక్షన్ వైరల్
-శ్రావణి భార్గవితో విడాకులు తీసుకున్నాడా!
-ఆ ఇద్దరు ఏమంటున్నారు.
సింగర్ గా 'హేమచంద్ర'(Hema Chandra)ట్రాక్ రికార్డు గురించి మూవీ లవర్స్ తో పాటు సంగీత ప్రేమికులకి తెలిసిందే. గాయకుల కోటాలో అభిమానులని సంపాదించే వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వాళ్ళల్లో హేమచంద్ర ఉంటాడు. ఎన్నో అద్భుతమైన పాటలు తన గాత్రం నుంచి వచ్చాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గా కూడా తన వాయిస్ తో ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. 2013 లో ఎన్నో అద్భుతమైన గీతాలని ఆలపించిన తోటి గాయని 'శ్రావణి భార్గవి'(Sravana Bhargavi)తో వివాహం జరిగింది. ఈ ఇద్దరికి ఒక పాప. కొన్ని రోజుల నుంచి ఆ ఇద్దరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన న్యూస్ ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మూడేళ్ల క్రితమే హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకొని విడిపోయారనేదే సదరు న్యూస్. ఈ క్రమంలో రీసెంట్ గా హేమచంద్ర ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.సదరు ఇంటర్వ్యూ లో యాంకర్ మాట్లాడుతు మీ వివాహ జీవితంపై సోషల్ మీడియా వేదికగా చాలా వార్తలు వస్తున్నాయి. మీరు ఇప్పటివరకు స్పందించలేదు అని అడగడం జరిగింది. అందుకు హేమచంద్ర మాట్లాడుతు న్యూస్ ఏదైనా సరే అది నిజమా కాదా అనే విషయాన్నీ పక్కన పెడదాం. కానీ ఆ విషయం మీకు ఏమైనా పనిస్తుందా? తెలుసుకోవడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా ?
అంటే చెప్పు చెప్తా.. నాపై వచ్చే కామెంట్స్ ని నేను కేర్ చెయ్యను. అవి నన్ను ఎఫెక్ట్ చేయవు. నిజమా కాదా అని నేనెందుకు రెస్పాండ్ కావాలి. నేను సింగర్ గా తెలుసు. దాని గురించి అడుగు. చాలా మంది ఏదో ఒక రకంగా వార్తల్లోఉండాలని అనుకుంటారు. కానీ నేను ఆ టైప్ కాదు. నేను మాట్లాడితే కనీసం ఒకరైనా ఇన్ స్పైర్ కావాలి. బేవర్స్ మాటలకి సమయం లేదు.
also read: రివాల్వర్ రీటా మూవీ రివ్యూ
నేను ఒకటే ప్రశ్న అడుగుతాను. ఈ విషయం నీకు ఎందుకు ఉపయోగపడుతుంది. అప్పుడు ఆన్సర్ నచ్చితే నా జీవితం గురించి చెప్తాను. ఒకరి పర్సనల్ లైఫ్ ఎందుకు. కావాలంటే నాకు టైమ్ ఉన్నప్పుడు మాట్లాడుతాను. అప్పటివరకు వెయిట్ చేయ్ అని హేమచంద్ర చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హేమచంద్ర కామెంట్స్ వైరల్ గా మారాయి.
![]() |
![]() |