![]() |
![]() |

మెజారిటీ స్టార్ హీరోలు వారి రెమ్యూనరేషన్ వారు తీసుకోవడమే కానీ.. నిర్మాతల కష్ట నష్టాల గురించి పెద్దగా పట్టించుకోరనే అభిప్రాయాలు ఉన్నాయి. నిజంగా టాలీవుడ్ స్టార్స్ అలాగే ఉంటారా? వారికి నిర్మాతల బాధలు పట్టవా?. ఈ విషయంపై తాజాగా ప్రముఖ నిర్మాత, మైత్రి రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రామ్ పోతినేని హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' (Andhra King Taluka) గురువారం విడుదలై, పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రవిశంకర్ కి మీడియా నుండి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
Also Read: 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ డే కలెక్షన్స్!
"నిర్మాతల కష్ట నష్టాలు పట్టించుకునే హీరోలు, నిర్మాతలకు అండగా ఉండే హీరోలు ఉన్నారా?" అనే ప్రశ్న ఎదురవ్వగా.. రవిశంకర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తమ బ్యానర్ లో పనిచేసిన హీరోలందరూ మంచివారేనని కితాబిచ్చారు.
"అందరు హీరోలు సపోర్టివ్ గానే ఉంటారు. రంగస్థలం అప్పుడు రామ్ చరణ్ గారు కొంత అమౌంట్ మా దగ్గరే ఉంచి.. ఎప్పుడో సంవత్సరం రెండు సంవత్సరాలకు తీసుకున్నారు. వాళ్ళకి డబ్బు ప్రధానం కాదు. మహేష్ బాబు గారు, చిరంజీవి గారు, రవితేజ గారు అందరూ అంతే. ఏడాది తర్వాత తీసుకున్నారు. ఓటీటీ రైట్స్ అమౌంట్ లేట్ వస్తుంది కదా.. వచ్చినప్పుడే ఇవ్వండి అనేవాళ్ళు. 'ఆంధ్ర కింగ్ తాలూకా'కు ఉపేంద్ర గారు రెగ్యులర్ గా తీసుకునే అమౌంట్ కంటే తక్కువ ఆఫర్ చేసినా ఆయన ఒక్క మాట అనలేదు. రామ్ గారు రెమ్యూనరేషన్ తీసుకోకుండా, ఏరియా రైట్స్ తీసుకొని సపోర్ట్ గా నిలిచారు. ఎన్టీఆర్ గారైతే మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండిలే అనే టైపులో ఉంటారు. ప్రభాస్ గారు కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు మీకు మిగిలితే ఇవ్వండి లేకపోతే లేదు అన్నారు. పుష్పకి అల్లు అర్జున్ గారు కూడా ఏడాది తర్వాత రెమ్యూనరేషన్ తీసుకున్నారు." అని నిర్మాత రవిశంకర్ చెప్పుకొచ్చారు.
https://x.com/Theteluguone/status/1994350065889280447?s=20
![]() |
![]() |