![]() |
![]() |

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రానుందని అంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే వీరి కాంబోలో సినిమా అంటూ వస్తున్న వార్తలు నిజమే. ఈ విషయాన్ని తాజాగా హరీష్ శంకర్ స్పష్టం చేశాడు. తాను త్వరలో రామ్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.
రామ్, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ది వారియర్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ జులై 14 న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న(ఆదివారం) సాయంత్రం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హరీష్ శంకర్ మాట్లాడుతూ.. తాను గతంలో రామ్ కి కథ చెప్తే రిజెక్ట్ చేశాడని, కానీ ఖచ్చితంగా వీలైనంత త్వరలో రామ్ తో సినిమా చేస్తానని చెప్పాడు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "డైరెక్టర్స్ తో రామ్ మంచి అనుబంధాన్ని కొనసాగిస్తాడు. ఎన్నోసార్లు ఆయనతో సినిమా చేయాలనుకున్నాను కానీ కుదరలేదు. ఒకసారి సెన్సిబుల్ లవ్ స్టొరీ కథ చెప్పాను. అది నచ్చలేదని చెప్పకుండా.. మనం సినిమా చేస్తే ఫ్యాన్ ఐదులో తిరగాలి, కానీ ఈ కథ విన్నాక మూడులోనే ఉందని చెప్పాడు. అలా చెప్పిన విధానం నాకు నచ్చింది. రామ్ తో ఖచ్చితంగా సినిమా ఉంటుంది. అది ఎప్పుడో చెప్పలేను.. కానీ వీలైనంత త్వరలో చేస్తాను." అని చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |