![]() |
![]() |

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఏజెంట్'. పాన్ ఇండియా రేంజ్ లో ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఏజెంట్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. కండలు తిరిగిన దేహంతో అఖిల్ లుక్ సరికొత్తగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ కు ముహూర్తం ఖరారైంది. జూలై 15 న టీజర్ ను విడుదల చేస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. కెరీర్ లో ఇప్పటిదాకా నాలుగు సినిమాలు చేసిన అఖిల్.. నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'తో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ఏజెంట్ తో సాలిడ్ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ అఖిల్ కెరీర్ కి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందేమో చూడాలి.
సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రసూల్ ఎల్లోర్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |