![]() |
![]() |

నటభూషణ శోభన్ బాబు కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `అమ్మ మాట` ఒకటి. వి. రామచంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమ్మగా `మహానటి` సావిత్రి అభినయించగా.. శోభన్ బాబుకి జోడీగా `కళాభినేత్రి` వాణిశ్రీ అలరించారు. చిత్తూరు నాగయ్య, సత్య నారాయణ, నాగ భూషణం, అల్లు రామలింగయ్య, రాజ బాబు, బేబి శ్రీదేవి, ప్రభాకర్ రెడ్డి, జ్యోతి లక్ష్మి, లత, రాజేశ్వరి, లీలా రాణి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. విజయలక్ష్మీ మూవీస్ పతాకంపై జీవీయస్ రాజు ఈ సినిమాని నిర్మించారు.
రమేశ్ నాయుడు సంగీతమందించిన ఈ చిత్రానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి. నారాయణ రెడ్డి, కొసరాజు సాహిత్యమందించారు. ఇందులోని ``మాయదారి సిన్నోడు.. మనసే లాగేసిండు`` (ఎల్. ఆర్. ఈశ్వరి గానం - సి.నా.రె రచన) ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలవగా.. ``ఎంత బాగా అన్నావు``, ``ఎందుకమ్మ ఆపుతావు``, ``ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండి సారూ``, ``ఎవరైనా చూశారా``, ``సద్దుమణగనీయవోయ్``, ``సారీ.. సరిగదా`` వంటి గీతాలు కూడా రంజింపజేశాయి. 1972 ఫిబ్రవరి 25న విడుదలై జననీరాజనాలు అందుకున్న `అమ్మ మాట`.. నేటితో 50 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |