![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'భీమ్లా నాయక్' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళం మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్, డేనియల్ శేఖర్ గా రానా దగ్గుబాటి నటించారు. ఈ సినిమాలో పేరుకి ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ, 'భీమ్లా నాయక్' అని టైటిల్ పెట్టడంతో పాటు సాంగ్స్, టీజర్స్ లో పవన్ ని హైలైట్ చేయడంతో.. ఈ మూవీలో రానా పాత్రని తక్కువ చేసి చూపిస్తారన్న అభిప్రాయం కలిగింది. కానీ సినిమా చూశాక ఆ అభిప్రాయం మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
డేనియల్ శేఖర్ పాత్రకి గ్రాండ్ ఇంట్రడక్షన్ లేదు, ఇంట్రో సాంగ్ లేదు. కానీ ఆ పాత్రని బలంగా తీర్చిదిద్దారు రచయిత, దర్శకుడు. ఇక ఆ పాత్రకి రానా కొండంత బలం అయ్యాడు. రానా స్క్రీన్ ప్రజెన్స్ కి ఎవరైనా క్లాప్స్ కొట్టాల్సిందే. తన బాడీ ల్యాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ఆ పాత్రలో ఉన్న అహాన్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు రానా. 'నేనే రాజు నేను మంత్రి' సినిమాలో ధర్మేంద్ర పాత్రని మరిపించేలా నటించాడు.
రానా నటుడిగా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ భీమ్లా నాయక్ లో రానా నటిస్తున్నాడని ప్రకటన వచ్చినప్పుడు, పవన్ లాంటి భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ సినిమాలో రానాకి అంతగా స్కోప్ ఉండకపోవచ్చు, అనవసరంగా ఈ సినిమా ఒప్పుకున్నాడన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ రానా తనదైన నటనతో అందరికీ సమాధానం చెప్పాడు. పవర్ స్టార్ సినిమా అయినప్పటికీ డేనియల్ గా తన మార్క్ చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు.
![]() |
![]() |