![]() |
![]() |
.webp)
హీరోలు తమ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆ స్థానాన్ని నిలుపుకునేందుకు, ఆ అభిమానాన్ని రెట్టింపు చేసుకునేందుకు హీరోలు సదా ప్రయత్నిస్తూనే ఉంటారు. కెజిఎఫ్ ముందు వరకు యశ్ ఒక సాధారణ హీరో. కెజిఎఫ్ తర్వాత తన అభిమాన గణాన్ని పెంచుకొని టాప్ హీరో రేంజ్‌కి వెళ్లిపోయాడు. సాధారణంగా అభిమానులు తమ హీరో పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇప్పటితో పోలిస్తే గతంలో ఈ సంప్రదాయం చాలా ఎక్కువగా ఉండేది. సోషల్ మీడియా బాగా విస్తరించిన తర్వాత కామెంట్స్ ద్వారానే విషెస్ తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
అయితే కన్నడ టాప్ హీరో యశ్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాలని భావించారు అతని అభిమానులు. అందుకే పెద్ద ఎత్తు ఏర్పాట్లు చేసుకున్నారు. జనవరి 8 యశ్ పుట్టినరోజు. కర్ణాటకలోని గడగ్ జిల్లా లక్ష్మేశ్మర్ తాలూకాలోని సురంగి గ్రామంలో యశ్ 38వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసేందుకు సిద్ధమైన అభిమానులు అతని భారీ కటౌట్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |