![]() |
![]() |

పలువురు స్టార్ల సపోర్ట్ తో 'హనుమాన్'(Hanuman) సినిమా స్థాయి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ మూవీలో కోతి పాత్ర కోసం రవితేజ(Raviteja) వాయిస్ అందించాడు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిరంజీవి(Chiranjeevi) రంగంలోకి దిగాడు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) వంతు వచ్చింది.
ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' మూవీ నుంచి జనవరి 8న గ్లింప్స్ (Devara Glimpse) విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గ్లింప్స్ ను జనవరి 12న విడుదలవుతున్న 'హనుమాన్' మూవీ థియేటర్లలో ప్రదర్శించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హీరో ఫిల్మ్ హనుమాన్ ముందు నుంచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దానికి తోడు సినిమాలో రవితేజ వాయిస్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్.. ఇక ఇప్పుడు థియేటర్లలో ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ తోడవ్వడంతో.. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల ఆసక్తి మరో స్థాయికి చేరింది.
![]() |
![]() |