![]() |
![]() |

ఆర్ఎక్స్ 100 మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చి ఫస్ట్ మూవీతోనే మంచి సిక్స్ ని అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ మూవీ హీరోయిన్ పాయల్ కెరీర్ లో బెస్ట్ మూవీ కూడా ఇదే అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘మంగళవారం’ సినిమా కూడా అంతే హిట్ గా నిలిచింది. అలాంటి అజయ్ భూపతి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. "2003 లో అనుకుంటా మా ఊరు గోదావరి పుష్కరాలు వచ్చాయి..అప్పుడనుకున్నా మళ్ళీ పుష్కరాలకు నేను డైరెక్టర్ అవ్వాలని. గోల్ పెట్టుకోకపోతే ఏదీ చేయలేము. 2007 ఎండింగ్ కి నేను హైదరాబాద్ వచ్చేసాను. అలా 2015 వచ్చేసింది. అప్పుడు నన్ను నేను ఎన్నో తిట్టుకున్నా. పుష్కరాలు అయ్యాయి కానీ నేను డైరెక్టర్ ని కాలేదు.
అప్పటికీ నేను ఆర్జీవీ దగ్గర పని చేస్తున్నా..అప్పటికి "వంగవీటి" మూవీకి నాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు..అప్పుడు స్క్రిప్ట్ ఇచ్చి నాకు వేరే చోట రాధా మర్డర్ షూట్ చేయాలని చెప్పారు ఆర్జీవీ. అప్పటికే మనసులో ఫిక్స్ ఇపోయా ఇంకా ఇది చేయకూడదు అని రూమ్ లో స్క్రిప్ట్ పేపర్స్ పెట్టేసి మా ఊరెళ్ళిపోయా. నేను ఎలా ఇంతలా ఎదిగాను అంటే దానికి కారణం ఈశ్వర్. ఆర్జీవీ దగ్గర డిజైన్స్ అవీ చేస్తుండేవాడు. అతనంటే నాకు చాలా ఇష్టం.
.webp)
నేను అతనితో పాటు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత రక్త చరిత్ర మూవీకి ఫోటో షూట్ ని నా మీదే చేశారు. అప్పట్లో రక్తం కారుతున్న చెయ్యి, అందులో ఒక కత్తి పట్టుకున్న ఒక పోస్టర్ వచ్చింది. అప్పట్లో ఆ పిక్ సూపర్ వైరల్ గా మారింది. ఆ చెయ్యి నాదే..ఒక సైకిల్ మీద కత్తులు పెట్టుకెళ్ళే లో యాంగిల్ సీన్ లో కనిపించేది కూడా నేనే...ఈశ్వర్ వాళ్ళ అలాగే నా జర్నీలో ఎంతో మంది వల్ల ఈరోజు నేను ఇంత పెద్ద డైరెక్టర్ కి కాగలిగాను. నేను పని చేసిన ఏ డైరెక్టర్ కూడా నన్ను వదులుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను వాళ్లకు పని తగ్గించేవాడిని. ఒక్కోసారి పనంతా వదిలేసి కేవలం ఖాళీగా ఉండేవాడిని. ఖాళీగా ఉండబట్టే కదా వేమన, బుద్ధుడు అంత గొప్పవాళ్ళు అయ్యారు. " అంటూ చెప్పాడు అజయ్ భూపతి.
![]() |
![]() |