![]() |
![]() |

దర్శకుడు అనుకున్న కథ ప్రేక్షకుల మస్తిష్కాల్లోకి వెళ్లాలంటే 'మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సపోర్ట్ చాలా ముఖ్యం. అందులోను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ, థ్రిల్లర్ సబ్జెట్స్ అయితే, ఆ సంగీత దర్శకుడు ఇచ్చే మ్యూజిక్, బిజీఎం పైనే, చిత్ర విజయం స్థాయి ఆధారపడి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఆ మాట అక్షరాల నిజమని మరోసారి నిరూపించిన సంగీత దర్శకుడు 'గౌరహరి'(Gowra Hari). అందుకు తగ్గట్టే 'మిరాయ్'(Mirai)కి 'గౌరహరి' ఎంతో ప్లస్ అయ్యాడనే మాటలు ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి.
రీసెంట్ గా మిరాయ్ సక్సెస్ ని పురస్కరించుకొని 'గౌరహరి మూవీకి సంబంధించిన కొన్ని విషయాల్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతు 'మిరాయ్' లో మిగతా క్యారెక్టర్స్ కి బిజిఎం ఇవ్వడానికి ఒకటి రెండు రోజుల సమయమే పట్టింది. కానీ రామునికి పది రోజులు కేటాయించవల్సి వచ్చింది. దీంతో రాముని(Sri Ramudu)ఎపిసోడ్ కి ఇచ్చే బిజీఎం ని చాలా సవాలుగా తీసుకున్నాను. దాదాపు పదినిమిషాల పాటు సాగే ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ లో చాలా కోణాలు కనిపిస్తాయి. రాముని వర్ణిస్తూనే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ని సినిమా టిక్ ఫీల్ తో చెప్పడం కోసం చిన్న చిన్న ప్రయోగాలు చేశాను. 'రుధిర కరణ', 'రుధిర పవన', 'రుధిర విభవ' పాటకి 'భజే రాంచంద్రం' అనే 'రామాష్టకం' చేశాను. కానీ ఇది విడివిడిగా అనిపించకుండా ఒకే ఫ్లో లో సాగుతున్న సాంగ్ లాగా అనిపిస్తుంది. విరామ సమయంలో వచ్చే 'సంపాతి పక్షి' ఎపిసోడ్ కోసం ఒకే సారి నాలుగు జోనర్ల సంగీతం వినిపించే ప్రయత్నం చేసానని 'గౌరహరి' చెప్పుకొచ్చాడు.
గౌర హరి చెప్పినట్టుగానే 'మిరాయ్' మొత్తంపై వచ్చే నేపధ్య సంగీతం ఒక ఎత్తయితే, ఇంటర్వెల్ లో వచ్చే సంపాతి పక్షి ఎపిసోడ్, క్లైమాక్స్ లో రాముడికి ఇచ్చిన బిజీఎం ఒక ఎత్తు. రాముని భక్తులతో పాటు, ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తుంది. అప్పుడే చాలా మంది తమ రింగ్ టోన్స్ గా కూడా యాడ్ చేసుకున్నారు. గత ఏడాది రిలీజై పాన్ ఇండియా వ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకున్న హనుమాన్ కి కూడా 'గౌరహరి' నే మ్యూజిక్ ని అందించాడు. కాకపోతే ఆ చిత్రానికి రావాల్సిన క్రెడిట్ పూర్తిగా రాలేదనే పట్టుదలతో 'మిరాయ్' కి వర్క్ చేసి ప్రేక్షకుల్లో తన కంటు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లోనే 'పినాక, జాంబిరెడ్డి పార్ట్ 2 , రణమండల, కాల చక్ర అనే చిత్రాలకి వర్క్ చేస్తున్నాడు.

![]() |
![]() |