![]() |
![]() |
సినిమా సంగీతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న ప్రతివారూ సినిమా సంగీత దర్శకులు కాలేరు. అలాగే సంగీత దర్శకులుగా టాప్ పొజిషన్‌కి వెళ్లిన వారందరూ శాస్త్రీయ సంగీతంలో లబ్ధ ప్రతిష్టులై ఉండక్కర్లేదు. శ్రోతల నాడిని పట్టుకొని మంచి సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్లందరూ సక్సెస్ అయ్యారు, టాప్ పొజిషన్‌కి వెళ్లారు. పాతతరం సినీ సంగీతానికి, ఇప్పటి మ్యూజిక్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. సంగీత దర్శకుల మధ్య పోటీ ఎప్పుడూ ఉంటుంది. పాత రోజుల్లో అది ఆరోగ్యకరమైన పోటీగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోవడం, అభిమానులు తమ అభిప్రాయాలను వివిధ ప్లాట్‌ఫామ్‌లపై వెలిబుచ్చడం వల్ల ఆ పోటీ బహిరంగంగా మారిపోతోంది.
ఇటీవలి కాలంలో స్టార్ హీరోలందరి సినిమాలకు తమన్ సంగీతం అందిస్తూ వస్తున్నారు. ఒక సందర్భంలో కొందరు హీరోల అభిమానులు ‘మాకు తమన్ వద్దు.. అనిరుధ్ కావాలి’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. ఈ కామెంట్స్ తమన్ అభిమానులకు, కొందరు నెటిజన్లకు బాధ కలిగించింది. అయితే తమన్ దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నట్టుగా కనిపించింది. పవన్‌కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘ఓజీ’కి తమన్ చేసిన మ్యూజిక్ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. గతంలో అలాంటి పాటలు చేసినప్పటికీ ఇందులో ఏదో కొత్తదనం చూపించాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు ‘ఓజీ’ పాటలు దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్నాయి. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతున్న ‘ఓజీ’ చిత్రానికి తమన్ మ్యూజిక్ డెఫినెట్‌గా పెద్ద ప్లస్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన కామెంట్స్‌కి తన మ్యూజిక్‌తోనే సమాధానం చెప్పాడు తమన్. దీన్నిబట్టి చూస్తే ‘ఓజీ’ దెబ్బ అనిరుధ్‌కి గట్టిగానే తగిలినట్టు అనిపిస్తోంది.
![]() |
![]() |