Home  »  News  »  మార్చి 4న '69 సంస్కార్ కాలనీ'.. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి!

Updated : Feb 15, 2022

లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి బాపిరాజు, ముతికి నాగ సత్య నారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "69 సంస్కార్ కాలనీ. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 4న విడుదలకు సిద్ధమైంది. వాలెంటైన్స్ డే సందర్భంగా మూవీ ట్రైలర్ ను ప్రెస్ మీట్ నిర్వహించి విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ.. "తెలుగు సినిమా ఎమోషనల్ గా నా హార్ట్ కు దగ్గరగా ఉంది. నేను చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు ప్రేక్షకులు నన్నెంతో ఆదరించడంతో నాకు మంచి గుర్తింపు లభించింది. తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమను నేనెప్పుడూ మర్చిపోలేను. మంచి సినిమా చేయాలి అనుకుంటున్న టైం లో సునీల్ కుమార్ గారు ఈ కథ చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా  అనిపించింది. ఇది ఫాంటసీ గానో, ఇమాజినేషన్  గానో కాకుండా ఉండే  స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమా. ప్రస్తుతం సొసైటీలో రిలేషన్ షిప్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయ్యింది. ఇప్పుడు మనము బ్రతుకుతున్న లైఫ్ కూడా చాలా కాంప్లికేటెడ్. ఇలాంటి సొసైటీ లో జరుగుతున్న చాలా విషయాల్లో లో హ్యుమాన్ రిలేషన్ షిప్ ఒకటి. ఇలాంటి పరిస్థితులు  చాలా మంది లైఫ్ లలో ఎదురవుతూ ఉంటాయి. . ఇలాంటి పరిస్థితులలో ఉన్న కథను మంచి కథనంతో తయారు చేయడం జరిగింది. ఈ కథ చాలా ఇంట్రెస్ట్ గా ఉండడమే కాకుండా  వినోదాత్మకంగా ఉంటుంది. తెలుగు ఆడియన్స్ కు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది" అన్నారు.

రిశ్వి తిమ్మరాజు మాట్లాడుతూ.. "నాకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. మా మూవీ లో కామెడీ, ఫన్, రొమాన్స్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. మార్చి 4న విడుదల అవుతుంది.  గొప్ప విజయం సాధిస్తుంది" అని అన్నారు.

చిత్ర నిర్మాత బాపిరాజు మాట్లాడుతూ.. "సునీల్ గారు కంటెంట్ ఉన్న కథలను చేయడానికి మాత్రమే ఇష్టపడతారు. గంగపుత్రులు, సొంత ఊరు, గల్ఫ్ లాంటి  సినిమాలు మాత్రమే కాదు రొమాంటిక్ అంశాలు ఉన్న చిత్రాలను సైతం గతం లో తీసి మెప్పు పొందారు. కేవలం యువతని ఆకర్షించడానికి మాత్రమే కాకుండా కధకు ఉన్న అవసరం బట్టి బోల్డ్ గా చిత్రీకరించడానికి వెనుకాడని దర్శకుడు అతను. ఈ కథను తను కూడా ప్రేమించి యువతకి నచ్చేలా తీర్చిదిద్ది మాకు అందించినందుకు ధన్యవాదాలు. అలాగే మా భీమవరం బుల్లెమ్మ ఎస్తర్ చాలా మంచి మనసున్న మనిషి. ప్రతి ఫ్రేమ్ లో అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఫుల్ సపోర్ట్  చేసింది. తను మూడు సినిమాలు చేస్తున్నా కూడా మా సినిమా ప్రమోషన్స్ కి వచ్చి మాకు సపోర్ట్ చేస్తుంది. ఆమెకు మా కృతజ్ఞతలు. నటీనటులు టెక్నీషియన్లు అందరూ చాలా సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. మార్చి 4న వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని  కోరుతున్నాను" అన్నారు

చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "కమర్షియల్ పాయింట్ అనే కాకుండా సామాజిక సారం ఉండాలనే ఉద్దేశంతో ఈ స్టోరీని డెవలప్ చేసి నిజ జీవితానికి  దగ్గరగా ఉండే విధంగా తీర్చిదిద్దిన తరువాతే షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఫ్రేమ్ ఎంతో ఇష్టంగా చాలా చక్కగా వచ్చేలా సహకరించిన నా టీం కి, దానికి సహకరించిన ఆర్టిస్టులకు ధన్యవాదాలు. ప్రతి పాత్రలో కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి. త్వరలో వైశాలికి సంబంధించిన మల్టిపుల్ డైమెన్షన్ ఉన్న  లుక్ ను రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని నమ్ముతున్నాను." అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.