![]() |
![]() |

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన మూవీ 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ తాను, డైరెక్టర్ కిషోర్ తిరుమల సంవత్సరానికి 60 రోజులు కేటాయించుకుంటే సినిమా తీయోచ్చని అన్నాడు.
"శతమానంభవతి తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయలేదని చాలామంది అడుగుతున్నారు. అలాగే 'మహానుభావుడు' లాంటి ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ చేయట్లేదని అడుగుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి, నవ్వించాలి అన్న ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. పాత శర్వానంద్ ని చూస్తారు. ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పగలను.. చిరునవ్వుతో, ఓ మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ తో ఇంటికి వెళ్తారు."
"రాధిక గారు, ఖుష్బూ గారితో వర్క్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. వారిని అభిమానించే నేను వారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. షూటింగ్ చాలా సరదాగా సాగిపోయింది. నిర్మాత సుధాకర్ గారికి థాంక్స్. రష్మిక మంచి డెడికేషన్ ఉన్న నటి. అంత బిజీ షెడ్యూల్ లో కూడా షూటింగ్ కి ఆన్ టైం లో వచ్చేది. రష్మిక డెడికేషన్ కి హ్యాట్సాఫ్."
"కామెడీ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చేయకూడదు. కథలో బలం ఉండాలి. దానిలో నుంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్ రావాలి. ఇంతమంచి స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకొచ్చినందుకు, ఇంత బాగా సినిమా తీసినందుకు డైరెక్టర్ కిషోర్ గారికి బిగ్ థాంక్స్. సంవత్సరానికి 60 రోజులు మనిద్దరం కేటాయించుకొని, సంవత్సరానికి ఒక సినిమా తీద్దామని షూటింగ్ లో అనుకునేవాళ్లం. అంత సరదాగా షూటింగ్ సాగిపోయింది." అని శర్వానంద్ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |