![]() |
![]() |

విజయ్ దేవరకొండ (vijay devarakonda)అభిమానులు, సినీ అభిమానుల ఆశ ఎట్టకేలకు ఫలించింది. వాళ్లంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ స్టార్ (family star) నిన్న విడుదల అయ్యింది. దేవరకొండ కెరీర్ లోనే వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో లాండింగ్ జరిగింది. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
ఫ్యామిలీ స్టార్ వరల్డ్ వైడ్ గా తొలి రోజు 5 .7 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఈ ఫిగర్ దేవరకొండ రేంజ్ కానే కాదు. పైగా మృణాల్ ఠాకూర్(mrunal thakur) పరశురామ్ (parasuram) దిల్ రాజు(dil raju)వంటి దిగ్గజాలు ఉండి కూడా అంత తక్కవ కలెక్షన్స్ రావడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. విజయ్ ఫ్యాన్స్ అండ్ సినీ ట్రేడ్ వర్గాలు కూడా కలెక్షన్స్ పట్ల విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరి వీకెండ్స్ లో కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి.
మూవీకి అయితే మిక్స్ డ్ టాక్ వస్తుంది. సినిమా స్లో గా ఉందని కొందరు అంటుంటే ఇలాంటి కథతో గతంలో చాలా సినిమాలు వచ్చాయని మరికొంతమంది అంటున్నారు.అలాగే దేవరకొండ, మృణాల్ ల మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదని అసలు దేవరకొండ లాంటి వెరైటీ హీరోతో రొటీన్ సినిమా తియ్యకూడదని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |