![]() |
![]() |

విజయ్ దేవరకొండ నయా మూవీ ఫ్యామిలీ స్టార్. హిట్టా ఫట్టా అనేది మరికొన్ని రోజులైతే గాని క్లారిటీ రాదు. ప్రస్థుతానికి అయితే పర్వాలేదనే టాక్ నడుస్తుంది. కానీ ఇప్పుడు ఒక నటి మాత్రం నా లాంటి దానికి అన్యాయం చేసారు కాబట్టే అట్టర్ ప్లాప్ అయ్యిందని అంటుంది. పైగా ఈ బోటి దానికి అంత బిల్డప్ అవసరమా! ఎడిటింగ్ కి కూడా ఒక దణ్ణం అంటుంది. మరి ఆమె ఎవరో చూద్దాం.
ఆషా బొర్రా..సోషల్ మీడియా ద్వారా చాలా ఫేమస్. తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఆమె చేసే రీల్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ కూడా ఇస్తు చిన్న సైజు సెలబ్రిటీ హోదా అనుభవిస్తుంది. ఈ గుర్తింపు తో ఫ్యామిలీ స్టార్ లో అవకాశాన్ని పొందింది. కానీ ఇప్పుడు ఆ మూవీపై తీవ్ర ఆరోపణలు చేస్తుంది. నన్ను అవుట్ స్టఫ్ లాగా వాడుకొని వదిలేస్తే సినిమా ప్లాప్ కాకుండా ఎందుకు ఉంటుంది. పైగా ఇదేదో గొప్ప సినిమా అయినట్టు డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరనుంచి కాస్టింగ్ డైరెక్టర్ వరకు ఒకటే ఫోన్లు. మీరు ఫ్యామిలీ స్టార్ లో క్యారక్టర్ చెయ్యండని..టైం వేస్ట్ తప్పితే ఇంకేం లేదని చెప్పింది.

అలాగే హెల్త్ బాగోకపోయినా యూనిట్ కి ఇచ్చిన ఒక్క మాట కోసం షూటింగ్ కి వచ్చానని, యాంటీ బయోటిక్ టాబ్లెట్స్ వేసుకొని మరి నటించానని కూడా చెప్పుకొచ్చింది. ఇస్తామన్న రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని,హోటల్ స్టే డబ్బులు కూడా నేనే కట్టానని కనీసం ట్రావెల్ ఖర్చులు కూడా ఇవ్వలేదని తెలిపింది. పోనీ విజయ్ దేవరకొండ తో చేసిన కాంబినేషన్స్ సీన్స్ అయినా సినిమాలో ఉంచినా కూడా అవన్నీ మర్చిపోయే దాన్ని.అని అంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి రానున్న రోజుల్లో ఈమె విషయం ఎటు వైపు మలుపు తీసుకుంటుందో చూడాలి. ఇక ఆమె ఫ్యామిలీ స్టార్ లో ఒకే ఒక్క సీన్ లో కనపడింది.
![]() |
![]() |