![]() |
![]() |

హీరో, హీరోయిన్ లకు సెట్స్ లో అసిస్టెంట్స్ గొడుగులు పడుతుంటారు. కానీ హీరోయిన్ కి ఒక హీరో గొడుగు పట్టడం ఎప్పుడైనా చూశారా?. వర్షం సాక్షిగా కర్నూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. హీరో రానా దగ్గుబాటి తన హీరోయిన్ సాయి పల్లవికి గొడుగు పట్టాడు.
రానా, సాయి పల్లవి జంటగా నటించిన 'విరాట పర్వం' మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక ఆదివారం సాయంత్రం కర్నూల్ లో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి వర్షం అంతరాయం కలిగించింది. గాలి వానకు స్టేజీ మీద ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్స్ కూడా కిందపడ్డాయి. అయినప్పటికీ ఈవెంట్ ని ఆపలేదు. గొడుగులు వేసుకొని మరీ ఈవెంట్ ని కొనసాగించారు. ఆడియన్స్ సైతం వర్షంలో తడుస్తూనే ఈవెంట్ ని సక్సెస్ చేశారు.
వేదికపైన సాయి పల్లవి మాట్లడుతున్న సమయంలో రానా గొడుగు పట్టుకోవడం ఆకట్టుకుంది. రానా గొడుగు పట్టుకోగా సాయి పల్లవి ఆ గొడుగు కింద నిల్చొని మాట్లాడింది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నవీన్ చంద్ర మరో గొడుగు పట్టుకోగా అందులో డైరెక్టర్ వేణు ఉడుగుల తల దాచుకున్నాడు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తమ కోసం వచ్చిన ప్రేక్షకుల కోసం గొడుగులేసుకొని వేడుకను కొనసాగించడం ఆకట్టుకుంది.
నక్సల్స్ నేపథ్యంలో 1990లలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన విరాట పర్వం మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |